అఫీషియల్: “భారతీయుడు 2” ట్రైలర్ డేట్ ఫిక్స్.!

అఫీషియల్: “భారతీయుడు 2” ట్రైలర్ డేట్ ఫిక్స్.!

Published on Jun 23, 2024 12:01 PM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, అలాగే కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “భారతీయుడు 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్నా సీక్వెల్ కాగా దీని కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ పై లేటెస్ట్ బజ్ వచ్చింది.

దీని ప్రకారం ఈ జూన్ 25న ట్రైలర్ వస్తుంది అని టాక్ రాగా ఇప్పుడు మేకర్స్ కమల్ పై పోస్టర్ తో అఫీషియల్ గా అదే డేట్ ని అనౌన్స్ చేసారు. మరి ఈ అవైటెడ్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో వివేక్, బ్రహ్మానందం, ఎస్ జే సూర్య తదితరులు నటించగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ జూలై 12 న చిత్రం తెలుగు, తమిళ్ సహా హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు