అఫీషియల్ : “దళపతి 68” పై మేకర్స్ సాలిడ్ అప్డేట్.!

Published on May 21, 2023 3:00 pm IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగ రాజ్ తో ఓ సాలిడ్ చిత్రం “లియో” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంపై భారీ హైప్ ఉండగా ఈ సినిమా తర్వాత అయితే మరో క్రేజీ కాంబినేషన్ ని విజయ్ సెట్ చేసినట్టుగా టాక్ వచ్చింది. అదే కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో అని బజ్ వచ్చింది. అయ్యితే ఇప్పుడు ఈ సెన్సేషనల్ కాంబినేషన్ పై మేకర్స్ సాలిడ్ అప్డేట్ ని అందించారు.

ఓ ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే ఈ కేజ్రీ కాంబినేషన్ ఉన్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి ఈ చిత్రానికి అయితే యువన్ శంకర్ రాజా సంగీతం అందించనుండగా ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రం అయితే ఈ ఏడాది ఆగస్ట్ నుంచి షూట్ స్టార్ట్ కానుండగా వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే వెంకట్ ప్రభు నుంచి రీసెంట్ గా అయితే “కస్టడీ” చిత్రం తెలుగు తమిళ్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :