అఫీషియల్ : పోస్ట్ పోన్ అయిన ‘చంద్రముఖి – 2’

Published on Sep 8, 2023 8:51 pm IST

రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ నటి కంగనా రనావత్ హీరోయిన్ గా పి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ హర్రర్ జానర్ కామెడీ యాక్షన్ మూవీ చంద్రముఖి 2. కొన్నేళ్ల క్రితం రజినీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా పి వాసు దర్శకత్వంలో రూపొందిన చంద్రముఖి ఎంతో పెద్ద విజయం సొంతం చేసుకుంది. దానితో సీక్వెల్ అయిన చంద్రముఖి 2 పై అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచాయి.

లైకా ప్రొడక్షన్స్ సంస్థ పై భారీ స్థాయిలో నిర్మితం అయిన ఈ మూవీకి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, వాస్తవానికి ఈ మూవీని సెప్టెంబర్ 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేస్తూ సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే టెక్నీకల్ సమస్యల కారణంగా తమ సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చిందని మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక వీడియో బైట్ ద్వారా మేకర్స్ ప్రకటించారు.

సంబంధిత సమాచారం :