అఫీషియల్: చిరు లీక్ నిజమే.. పవన్ పదవి, శాఖలు ఇవే..!

అఫీషియల్: చిరు లీక్ నిజమే.. పవన్ పదవి, శాఖలు ఇవే..!

Published on Jun 14, 2024 4:20 PM IST

మన టాలీవుడ్ సినిమా నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి పలువురు ప్రముఖుల్లో స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మరి పవన్ హీరోగా ఇపుడు మూడు సినిమాలు చేస్తుండగా ఈ సినిమాలకి కొంచెం గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లో కష్టపడగా అందులో సూపర్ సక్సెస్ అయ్యారు. అయితే పవన్ మొదటిసారి చట్ట సభల్లోకి అడుగు పెట్టబోతున్నాడు.

అయితే గత కొన్ని రోజులు నుంచి ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటూ కొన్ని రూమర్స్ విరివిగా వినిపించగా పవన్ సోదరుడు టాలీవుడ్ దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన చిరు లీక్ తో కూడా అది మరింత బలపడింది. అయితే ఇప్పుడు దీనిపై అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది.

ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ భాద్యతలు చేపడుతున్నట్టుగా అధికారికంగా స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఇక దీనితో పాటుగా పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రి, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి, అటవీ – పర్యావరణ శాఖా మంత్రి, సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రి ఈ శాఖల్లో భాద్యతలు చేపట్టినట్టుగా రివీల్ చేశారు. మొత్తానికి అయితే పవన్ అభిమానులు, మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు