అఫీషియల్: బాలీవుడ్ స్టార్ తో గోపీచంద్ భారీ ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చేసింది

అఫీషియల్: బాలీవుడ్ స్టార్ తో గోపీచంద్ భారీ ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చేసింది

Published on Jun 20, 2024 9:41 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లో వరుస హిట్స్ తో అదరగొడుతున్న మాస్ స్టార్ దర్శకుల్లో గోపీచంద్ మలినేని కూడా ఒకరు. క్రాక్, వీరసింహా రెడ్డి సినిమాలతో అదరగొట్టిన ఈ దర్శకుడు నెక్స్ట్ కూడా మాస్ మహారాజ రవితేజతో (Raviteja) సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇది అఫీషియల్ గా అనౌన్స్ అయినప్పటికీ కొన్ని కారణాలు చేత నిలిచిపోయింది.

మరి ఈ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) తో సినిమా చేస్తున్నారని కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే ఇది దాదాపు ఖరారే కానీ ఇపుడు ఈ క్రేజీ కాంబినేషన్ పై అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారు. దేశంలోనే బిగ్గెస్ట్ యాక్షన్ సినిమా అంటూ తమ సినిమాని సన్నీ డియోల్ తో మేకర్స్ అనౌన్స్ చేశారు.

మరి షూటింగ్ అతి త్వరలోనే మొదలు పెట్టుకోనున్న ఈ చిత్రం మాస్ ఫీస్ట్ అందించబోతుంది అని ఎగ్జైటింగ్ అప్డేట్ ని అందించారు. అలాగే ఈ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి అయితే ఇండియన్ సినిమా దగ్గర మరో క్రేజీ కాంబినేషన్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు