బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎమోషనల్ మూవీ జవాన్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ తో కొనసాగుతోంది. యువ దర్శకడు అట్లీ తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నెగటివ్ రోల్ చేసారు. భారీ హంగులతో ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గౌరి ఖాన్ నిర్మించారు.
ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన జవాన్ ఫస్ట్ డే భారీ స్థాయి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా రూ. 129.6 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుందని కొద్దిసేపటి క్రితం మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించారు. కాగా ఇది హిందీ సినిమా హిస్టరీలో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్ గా రికార్డుకెక్కింది. మరి రాబోయే రోజుల్లో జవాన్ ఎంతమేర కొల్లగొడుతుందో చూడాలి.