అఫీషియల్ : ‘లియో’ ఆడియో లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్

Published on Sep 27, 2023 12:30 am IST

ఇళయదళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ పాన్ ఇండియా మూవీ లియో. గ్రాండ్ లెవెల్లో గ్యాంగ్ స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీని సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న లియో నుండి ఇప్పటికే రిలీజ్ అయిన అనౌన్స్ మెంట్ టీజర్, ఫస్ట్ సాంగ్ తో పాటు కీలక పాత్రలు చేస్తున్న అర్జున్, సంజయ్ దత్ ల గ్లింప్స్ ఆకట్టుకుని మూవీ పై ఎన్నో అంచనాలు ఏర్పరిచాయి.

మ్యాటర్ ఏమిటంటే, లియో మూవీ యొక్క ఆడియో లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా సెప్టెంబర్ 30న చెన్నైలో నిర్వహించాలని యూనిట్ భావించింది. అయితే ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఫ్యాన్స్ నుండి పాస్ లకు రిక్వెస్ట్ లు రావడంతో పాటు ఫంక్షన్ కి మరింత భారీగా అభిమానగణం తరలివచ్చే అవకాశం ఉండడంతో క్రౌడ్ ని కంట్రోల్ చేయడంలో ఏదైనా తప్పిదం జరిగితే అందరికీ ఇబ్బంది కలుగుతుంది కనుక తాము ఆడియో ఫంక్షన్ ని క్యాన్సిల్ చేస్తున్నట్లు లియో మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు.

అయితే ఇది ఎటువంటి పొలిటికల్ ప్రెజర్స్ వలన కానీ మరే ఇతర కారణం వలన కానీ క్యాన్సిల్ కాలేదనే విషయాన్ని అందరూ అర్ధం చేసుకోవాలని మేకర్స్ పెట్టిన ఈ పోస్ట్ తో ఒకింత విజయ్ ఫ్యాన్స్ హార్ట్ అయ్యారు. అలానే త్వరలో మూవీ నుండి పక్కాగా ఒక్కొక్కటిగా అప్ డేట్స్ వస్తాయని మేకర్స్ హామీ ఇచ్చారు. అయితే ఈ నిర్ణయం తామందరి మంచి కోసమే తీసుకున్నది కాబట్టి త్వరలో లియో నుండి అప్ డేట్స్ ని ఎంజాయ్ చేస్తాం అంటూ పలువురు ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగా లియో మూవీ అక్టోబర్ 19న పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :