అఫీషియల్ : “మగధీర” రీ రిలీజ్ ఖరారు.!

Published on Feb 23, 2023 11:05 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కెరీర్ మొదలు పెట్టిన రెండో సినిమాతోనే సెన్సేషనల్ హిట్ ని అందుకున్నాడు. మరి ఆ సినిమానే “మగధీర”. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ చిత్రం అప్పట్లో కనీ వినీ ఎరుగని రేంజ్ భారీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి చరిత్ర సృష్టించింది. దీనితో లాంగ్ రన్ సినిమాలన్నా ఇండస్ట్రీ హిట్ టాపిక్ వచ్చినా అది మగధీర లేకుండా జరగదు.

మరి అలాంటి హిట్ గా నిలిచిన ఈ సినిమా అయితే ఇప్పుడు సిసలైన రీ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. గత కొన్నాళ్ల నుంచి ఈ టాక్ ఉన్నప్పటికీ ఇప్పుడు అయితే ఈ సినిమా పై ఆ అధికారిక అప్డేట్ వచ్చింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మార్చ్ 27కి రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వారు ఈ బిగ్ అప్డేట్ ని ఇప్పుడు రివీల్ చేశారు. దీనితో ఈ అప్డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ భారీ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :