అఫీషియల్: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఎప్పుడంటే!

ఈ రానున్న వారం థియేటర్స్ లో సందడి చేసేందుకు రాబోతున్న పలు చిత్రాల్లో ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన మ్యాజికల్, విజువల్ ట్రీట్ చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ కూడా ఒకటి. దర్శకుడు శశాంక్ యేలేటి తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రాన్ని దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కాంపౌండ్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.

ఇక రీసెంట్ గానే ట్రైలర్ కోసం బాలయ్యని దింపితే ప్రీ రిలీజ్ కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని దింపుతున్నట్టుగా టాక్ వినిపించింది. ఇక దీనిపై మేకర్స్ అధికారిక క్లారిటీ ఇచ్చేసారు. ఓ ఫన్ వీడియో రిలీజ్ చేసి ఈ సెప్టెంబర్ 29న జరగనున్న గ్రాండ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో ఇది మాత్రం తారక్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ ఈవెంట్ హైదరాబాద్ లో జె ఆర్ సి కన్వెన్షన్ లో జరగనుంది. అక్టోబర్ 2న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.

Exit mobile version