మన ఇండియన్ ఓటిటి కంటెంట్ లో సూపర్ హిట్ అయ్యిన పలు వెబ్ సిరీస్ లు ఉన్నాయి. మరి వాటిలో ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా చాలానే ఉన్నాయి. అయితే ఆ వెబ్ సిరీస్ లలో సాలిడ్ బోల్డ్ యాక్షన్ అండ్ వైలెంట్ డ్రామా “మీర్జాపూర్” కూడా ఒకటి. మరి ఈ వెబ్ సిరీస్ మొత్తం మూడు సీజన్స్ ని పూర్తి చేసుకొని నాలుగో సీజన్ కి కూడా సిద్ధం అయ్యింది.
అయితే ఈ నాలుగో సీజన్ అటుంచితే ఈ సిరీస్ కాకుండా మీర్జాపూర్ యూనిట్ ప్రైమ్ వీడియోతో ఒక స్పెషల్ ప్లానింగ్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపించాయి. దీనితో మీర్జాపూర్ పై ఈసారి ఒక స్పెషల్ సినిమా రాబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. మరి వీటిని నిజం చేస్తూ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ సినిమాపై అఫీషియల్ అప్డేట్ కూడా ఇచ్చేసారు. మరి ఈ సినిమా అయితే రానున్న 2026లో థియేటర్స్ లో ఉంటుంది అని ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
Diwali pe sabko mithai milti hai, lekin yeh lo, Mirzapur ki asli barfi ????#MirzapurTheFilm, coming soon ???? pic.twitter.com/v42gEY1vA3
— prime video IN (@PrimeVideoIN) October 28, 2024