అఫీషియల్ : రామ్ – బోయపాటి శ్రీను మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Mar 27, 2023 10:01 pm IST

ఉస్తాద్ రామ్ హీరోగా మాస్ సినిమాల దర్శకడు బోయపాటి శ్రీను తొలిసారిగా కలిసి చేస్తున్న మూవీ పై మొదటి నుండి రామ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఎంతో భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ ప్రతిష్టాత్మక మూవీని దసరా కానుకగా అక్టోబర్ 20న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. తన సినీ కెరీర్ 20వ సినిమాగా రామ్ నటిస్తున్న ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండడంతో పాటు రిలీజ్ తరువాత సినిమా అందరినీ ఆకట్టుకుని మంచి సక్సెస్ సొంతం చేసుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :