అఫీషియల్ : ఆ బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ లో రష్మికా మందన్నా ఫిక్స్.!

Published on Apr 2, 2022 6:12 pm IST


తన ఫస్ట్ సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్న టాలీవుడ్ న్యూ ఏజ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. తన ఫస్ట్ సినిమా “అర్జున్ రెడ్డి” ని హిందీలో “కబీర్ సింగ్” గా తెరకెక్కించి బాలీవుడ్ లో కూడా ఒక్కసారిగా స్టార్ స్టేటస్ ని తెచ్చేసుకున్నాడు. అలా అక్కడ స్టార్ దర్శకుడు మారి అక్కడి స్టార్ హీరో అయినటువంటి రణబీర్ కపూర్ తో మరో సాలిడ్ సబ్జెక్టు “యానిమల్” ని అనౌన్స్ చేశారు.

అయితే ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొనగా లేటెస్ట్ గా సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ఫిక్స్ అయ్యిందని పలు ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ టాక్ ని నిజం చేస్తూ నిర్మాణ సంస్థ టి సిరీస్ వారు అధికారికంగా అనౌన్స్ చేశారు. అలాగే ఈ షూటింగ్ ఈ వేసవి నుంచి స్టార్ట్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. మరి రష్మికా రోల్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :