ఇండియన్ సినిమా దగ్గర ది బెస్ట్ హారర్ థ్రిల్లర్ చిత్రాల్లో డెఫినెట్ గా ముందు ఉండే సినిమానే “తుంబాడ్”. దర్శకుడు అనీల్ రాహి బర్వె తెరకెక్కించిన ఈ చిత్రం 2018 తర్వాత సెన్సేషనల్ అయ్యింది. ఇక ఈ చిత్రం రీరిలీజ్ అయ్యాక మేకర్స్ పార్ట్ 2 ని కూడా అనౌన్స్ చేయడంతో దానిపై భారీ హైప్ సెట్ అయ్యింది. మేకర్స్ చాలా శ్రద్దగా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తుండగా ఈ సినిమాలో విలన్ రోల్ కి గాను పాపులర్ నటుడు ఒకరు కనిపిస్తారు అని ఆ మధ్య రూమర్ వచ్చింది.
బాలీవుడ్ వెర్సటైల్ నటులు అక్షయే ఖన్నా మరియు నవాజుద్దీన్ సిద్దిఖీ రేస్ లో ఉన్నట్టు టాక్ వచ్చింది. కానీ ఫైనల్ గా సైంధవ్ విలన్ నవాజుద్దీన్ నే మేకర్స్ ఆ కీలక పాత్రకి ఫిక్స్ చేసినట్టు ప్రకటించారు. నటుడు సోహుమ్ షాహ్ తో కలిసిన స్టిల్స్ కొన్ని వదిలి ఈ భారీ చిత్రంపై కీలక అప్డేట్ ని మేకర్స్ అందించారు. ఇక ఈ సినిమా ఏ లెవెల్లో థ్రిల్ చేస్తుందో కానీ అభిమానులు మాత్రం ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
