‘శాకుంతలం’ విడుదల తేదీ వాయిదా !

Published on Feb 7, 2023 3:14 pm IST

సమంత, దేవ్ మోహన్ హీరో హీరోయిన్స్ గా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ పౌరాణిక చిత్రం శాకుంతలం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీలో శకుంతలగా సమంత నటించగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. కాగా తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ వాయిదా పడింది. ఇదే విషయాన్ని ఈరోజు మేకర్స్ ప్రకటించారు. చిత్రబృందం ప్రెస్‌ నోట్‌ విడుదల చేస్తూ.. రాబోయే రోజుల్లో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు ధృవీకరించారు.

కాగా ఈ సినిమాలో మోహన్‌ బాబు దూర్వాసుడిగానూ నటిస్తున్నారు. అల్లు అర్జున్ తనయ అర్హ భరతుడిగా కనిపించబోతోంది. గుణటీమ్ వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సమంత గెటప్ అద్భుతంగా ఉండబోతోందని తెలుస్తోంది. సమంత నటిస్తున్న మొట్టమొదటి పౌరాణిక చిత్రం కావడంతో ‘శాకుంతలం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :