ఆఫీషియల్ : “విక్రమ్” ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది..!

ఆఫీషియల్ : “విక్రమ్” ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Published on Jun 29, 2022 12:54 PM IST


లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ ల కాంబోలో వచ్చిన లేటెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా “విక్రమ్”. ఓవరాల్ వరల్డ్ భారీ వసూళ్లతో అదరగొట్టిన ఈ చిత్రం హిందీలో వసూళ్లు కాకుండానే ఏకంగా 400 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. మరి ఇంతటి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటి లో రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చేసింది.

ఈ సినిమా అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న ప్రముఖ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వారు లేటెస్ట్ గా సినిమా డేట్ ని అయితే అనౌన్స్ చేసేసారు. కమల్ పై ఒక ఇంట్రెస్టింగ్ యాక్షన్ వీడియోతో ఏఈ చిత్రం తమ హాట్ స్టార్ లో ఈ జూలై 8 నుంచి అందుబాటులోకి రాబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి అయితే ఫైనల్ గా విక్రమ్ బ్లాస్ట్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ అలాగే సూర్య లు కీలక పాత్రల్లో నటించగా అనిరుద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు