ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతీ తెరకెక్కించిన హారర్ ఫాంటసీ చిత్రం ది రాజా సాబ్ (The Raja Saab) కూడా ఒకటి. సంక్రాంతిని ఈ సినిమానే మొదలు పెట్టింది కానీ ఫైనల్ గా మాత్రం నిరాశనే మిగిల్చింది. ఇక ఈ సినిమా ఫైనల్ గా థియేటర్స్ లో నుంచి ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది. రీసెంట్ గానే ఈ సినిమా ఓటిటి రిలీజ్ అప్డేట్ అప్డేట్ అందించాము.
ఇప్పుడు అది నిజం చేస్తూ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు డేట్ కన్ఫర్మ్ చేసేసారు. ఈ ఫిబ్రవరి 6 నుంచే అందుబాటులోకి తెస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. కానీ ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వడం లేదు. కేవలం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే వస్తున్నట్టు తెలిపారు. మరి హిందీ వెర్షన్ పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ అలాగే నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు. అలాగే ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.
