అఫీషియల్ : పవన్ – సాయి ధరమ్ తేజ్ మూవీలో కీలక పాత్రల్లో నటించేది వీరే

Published on Feb 28, 2023 4:02 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ల తొలి కలయికలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఇటీవల అధికారికంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక మూడు రోజుల నుండి ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూట్ ని ప్రారంభించింది యూనిట్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై వివేక్ కూచిభొట్ల, టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ, తమిళ సూపర్ హిట్ అయిన వినోదయ సిత్తం కి రీమేక్ గా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

కాగా ఈ ప్రతిష్టాత్మక మూవీలో కీలక పాత్రలు పోషించనున్న నటీనటులని కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, రాజా చెంబోలు, రోహిణి, బ్రహ్మాండం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు తదితరులు ఇందులో నటించనున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఒరిజినల్ వర్షన్ యొక్క స్క్రిప్ట్ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసారట. మొత్తంగా ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది ప్రేక్షకాభిమానుల ముందుకు తీసుకువచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :