అఫీషియల్ : “దళపతి 67” లో ఆమె ఖరారు.!

Published on Feb 1, 2023 2:21 pm IST

ప్రస్తుతం కోలీవుడ్ సినిమా దగ్గర మాత్రమే కాకుండా సౌత్ ఇండియా సినిమా దగ్గర కూడా భారీ అంచనాలు ఉన్న సెన్సేషనల్ కాంబో ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం ఇళయ దళపతి విజయ్ మరియు దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ ల కాంబినేషన్ లో చేసిన సినిమా కాగా ఈ చిత్రం విజయ్ కెరీర్ లో 67 వ సినిమాగా రాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి నిన్ననే మేకర్స్ వరుసగా క్యాస్టింగ్ కి సంబంధించి అప్డేట్స్ రివీల్ చేయడం కూడా ఆసక్తిగా మారింది.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఇంకో అనౌన్సమెంట్ కోసం అయితే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే ప్రముఖ హీరోయిన్ త్రిష కృష్ణన్ కోసమే. దాదాపు 14 ఏళ్ల తర్వాత విజయ్ తో త్రిష కనిపించనుంది అనే బజ్ కొన్ని వారాల కితం మంచి బజ్ అయితే వచ్చింది. దీనితో బాగా ఎగ్జైట్ అయ్యిన అభిమానుల అంచనా నిజం చేస్తూ ఫైనల్ గా అయితే చిత్ర యూనిట్ లేటెస్ట్ గా ఆ బజ్ ని నిజం చేసి ఆ సాలిడ్ అప్డేట్ ని కన్ఫర్మ్ చేసేసారు. దీనితో ఈ సినిమాపై మరింత హైప్ అయితే స్టార్ట్ అయ్యింది.

సంబంధిత సమాచారం :