ఆఫీషియల్..”సర్కారు వారి పాట” టోటల్ రన్ టైం లాక్.!

Published on May 8, 2022 1:00 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేసేందుకు మరికొన్ని రోజుల్లో సిద్ధం అవుతుంది.

అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి అన్ని సన్నాహాలు సిద్ధం చేస్తున్న మేకర్స్ ఇప్పుడు సినిమా టోటల్ రన్ టైం పై ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ తెచ్చుకోగా ఈ సినిమా టోటల్ గా ఎంతసేపు మెంటల్ మాస్ ట్రీట్ ని ఇస్తుందో తెలిపారు. ఈ సినిమా మొత్తం 162 నిమిషాల 25 సెకండ్ల పాటు ఉంటుంది అని కన్ఫర్మ్ చేసారు.

అలాగే బుకింగ్స్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు తెలిపారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా మహేష్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు సంయుక్తంగా నిర్మాణం అందించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :