ట్రైలర్ తో వచ్చిన ‘డేగల బాబ్జీ’ !

Published on Nov 8, 2021 9:36 am IST

బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డేగల బాబ్జీ’. కాగా తాజాగా ఈ చిత్రం నుంచి థియేట్రికల్ ట్రైలర్ ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ట్రైలర్ లో కథ తాలూకు మెయిన్ అంశాలను ఎలివేట్ చేస్తూ ట్రైలర్ ను కట్ చేశారు. అలాగే ట్రైలర్ మొత్తం బండ్ల గణేష్ చుట్టూనే తిరిగింది. అన్ని రకాల ఎమోషన్స్ ను బండ్ల గణేష్ పాత్రలో ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది.

కాగా ఈ సినిమాను యష్ రిషి ఫిల్మ్స్ బ్యానర్ పై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ సాధించిన ఒత్త సేరుప్పు సైజ్ 7 కి ఈ చిత్రం రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More