ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా నేషనల్ క్రష్ రశ్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “వారిసు”. తమిళ్ లో భారీ అంచనాలతో ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ తెలుగు లో “వారసుడు” పేరిట రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్ డేట్ ని గత కొన్నాళ్లుగా మేకర్స్ మంచి సస్పెన్స్ గా ఉంచుతూ వస్తుండగా ఇప్పుడు అయితే రిలీజ్ అధికారికంగా బయటకు వచ్చేసింది.
మరి ఈ చిత్రాన్ని అయితే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టుగా ఈ సినిమా యూకే డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వారు కన్ఫర్మ్ చేసేసారు. దీనితో అయితే ఈ అవైటెడ్ సినిమా ఫైనల్ గా జనవరి 12న రాబోతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
Let’s get ready for #VarisuPongal ????
UK release by #AhimsaEntertainment ????
12.01.23 ????@actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_official @TeamDreamZE @cineworld @ODEONCinemas @vuecinemas @ShowcaseCinemas #Varisu #Vaarasudu @ahimsafilms pic.twitter.com/D0O1wayjGs
— Ahimsa Entertainment (@ahimsafilms) November 30, 2022