అఫీషియల్ : “వీరసింహా రెడ్డి” స్ట్రీమింగ్ డేట్ ఖరారు.!

Published on Feb 12, 2023 11:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ గా నటించిన మాస్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “వీరసింహా రెడ్డి” కోసం తెలిసిందే. దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య చేసిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ఇప్పుడు థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకుంటూ ఉండగా లేటెస్ట్ గానే డిస్నీ+ హాట్ స్టార్ వారు సినిమా స్ట్రీమింగ్ కి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.

మరి ఇప్పుడు లేటెస్ట్ గా ఆ అధికారిక డేట్ ని అయితే అనౌన్స్ చేసేసారు. ఈ చిత్రం వారి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో ఈ ఫిబ్రవరి 23 నుంచి ప్రసారం కానున్నట్టుగా తెలిపారు. మరి ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ నటించగా మురళి శర్మ, వెర్సటైల్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కన్నడ స్టార్ నటుడు దునియా విజయ్ విలన్ రోల్ లో నటించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ ఏడాది లో మొదటగా రిలీజ్ చేసిన ఈ సినిమాతో ఓ శుభారంభాన్ని అందుకున్నారు.

సంబంధిత సమాచారం :