అఫీషియల్ : రెండు పార్టులుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’

Published on Oct 4, 2023 4:34 pm IST


టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా కొరటాల శివ తో చేస్తున్న భారీ మాస్ యక్షన్ మూవీ దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పై ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న దేవర మూవీ షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది.

కాగా మ్యాటర్ ఏమిటంటే, తమ మూవీని రెండు పార్టులుగా రూపొందించి విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ కొద్దిసేపటి క్రితం ఒక వీడియో బైట్ ద్వారా అఫీషయల్ గా కన్ఫర్మ్ చేసారు. నిజానికి ఈ స్టోరీ యొక్క స్పాన్ ఎక్కువ ఉండడంతో దీనిని ఆడియన్స్ కి మరింతగా చేరువ చేయడానికి రెండు పార్టులు అవసరం అని తమ టీమ్ మొత్తం భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కొరటాల. అలానే సినిమాని ఎంతో గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నాం అని, అలానే ఇప్పటికే ప్రకటించినట్లుగా మొదటి పార్టు 2024 ఏప్రిల్ 5 న పక్కాగా రిలీజ్ అవుతుందని ఆయన అన్నారు. కాగా ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు.

https://x.com/DevaraMovie/status/1709521829210329280?s=20

సంబంధిత సమాచారం :