పెళ్లి చేసుకున్న నయనతార – విఘ్నేష్ శివన్!

Published on Jun 9, 2022 4:01 pm IST

స్టార్ హీరోయిన్ నయనతార మరియు విఘ్నేష్ శివన్ ఏడేళ్ల సుదీర్ఘ రిలేషన్ షిప్ తర్వాత పెళ్లి చేసుకున్నారు. చెన్నైలోని మహాబలిపురంలో జరిగిన ఈ వివాహ వేడుక ఇరువురి సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. షారుఖ్ ఖాన్, అజిత్ వంటి ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు.

ఈ జంట యొక్క పెళ్లికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నయన్ ఉత్తర భారత శైలిలో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఎరుపు రంగు చీరలో చాలా అందంగా ఉంది. విఘ్నేష్ తమిళ సంప్రదాయ దుస్తులను ధరించాడు. ఈ జంట తమిళ వివాహం చేసుకున్నారు మరియు రేపు ప్రెస్ కోసం రిసెప్షన్ నిర్వహించనున్నారు.

సంబంధిత సమాచారం :