అఫీషియల్ : అజిత్ ‘తునీవు’ తెలుగు టైటిల్ ఫిక్స్

అఫీషియల్ : అజిత్ ‘తునీవు’ తెలుగు టైటిల్ ఫిక్స్

Published on Dec 21, 2022 6:30 PM IST


కోలీవుడ్ స్టార్ తలా అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ తునీవు. మంజు వారియర్ కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీని బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తో కలిసి జీ స్టూడియోస్ వారు ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక తునీవు నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా అజిత్ ఫ్యాన్స్ ని అలానే ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానున్న తునీవు తప్పకుండా మంచి సక్సెస్ అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీని తెలుగులో డబ్ రిలీజ్ చేయనున్న యూనిట్ కొద్దిసేపటి క్రితం దీనికి తెగింపు అనే టైటిల్ ని ఫిక్స్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఇక ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్, ఐవివై ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నాయి. తెలుగులో కూడా అజిత్ కి మంచి క్రేజ్ ఉండడంతో ఇక్కడ కూడా ఈ మూవీ బాగా సక్సెస్ అవుతుందని అంటున్నారు నిర్మాతలు. అతి త్వరలో తెగింపు మూవీ యొక్క సాంగ్స్ తో పాటు ఇతర అప్ డేట్స్ కూడా అఫీషియల్ గా విడుదల కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు