రేపు సంధ్య 35ఎంఎం లో ఓజీ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్!

Published on Sep 1, 2023 6:00 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్). డివివి దానయ్య ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. పవర్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2) న మేకర్స్ ఫ్యాన్స్ కి గట్టి ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

రేపు సంధ్య 35ఎంఎం లో ఓజీ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఫ్యాన్స్ కి ఇది సూపర్ ట్రీట్ అని చెప్పాలి. రేపు ఉదయం 9:30 గంటలకి గ్లింప్స్ ను లాంఛ్ చేయనున్నారు. అయితే ఆన్లైన్ లో 10:35 గంటలకు రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ హంగ్రీ చీతా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :