OG : పవన్ కళ్యాణ్ టీ-షర్ట్ మరియు సన్ గ్లాసెస్ ధర ఎంతంటే ?

OG : పవన్ కళ్యాణ్ టీ-షర్ట్ మరియు సన్ గ్లాసెస్ ధర ఎంతంటే ?

Published on May 2, 2023 8:59 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఓజి ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. ఇక ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా దీనిని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నిన్నటితో ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో సెకండ్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. ఇక నేడు ఈ సినిమా నుండి పవన్ కళ్యాణ్ స్టిల్ ఒకటి రిలీజ్ చేసారు మేకర్స్.

బ్లూ కలర్ టి షర్ట్, బ్లాక్ కలర్ గ్లాసెస్ తో స్టైలిష్ గా పవన్ ఈ లుక్ లో అదరగొట్టారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క డైహార్డ్ అభిమానులు ఆయన ధరించిన టీ-షర్ట్ మరియు సన్ గ్లాసెస్ ధర కోసం గూగుల్ లో వెతుకులాట మొదలెట్టారు. కాగా పవన్ ధరించిన హ్యూగో బాస్ టీ-షర్ట్ ధర దాదాపు రూ. 11,000, మోంట్ బ్లాంక్ సన్ గ్లాసెస్ ధర రూ. 24,000 అని తెలుస్తోంది. మొత్తంగా ప్రస్తుతం ఓజి షూటింగ్ ఫుల్ స్వింగ్ లో అయితే కొనసాగుతోంది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు