పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో రెండు పాన్ ఇండియా సినిమాలు అలాగే ఓ రీజనల్ మాస్ చిత్రం కూడా ఉంది. అయితే పాన్ ఇండియా సినిమాలు “ఓజి” అలాగే “హరిహర వీరమల్లు” సినిమాలు ఓ రేంజ్ లో హైప్ ని చూశాయి. అయితే ఇపుడు ఈ రెండు సినిమాల మధ్యనే ఇంట్రెస్టింగ్ వార్ నడుస్తుంది. నిజానికి ఓజి అనౌన్స్ కాక ముందు వీరమల్లు హైప్ వేరే లెవెల్లో ఉండేది.
కానీ ఒక్కసారి ఓజి అనౌన్స్ కావడం అన్నీ శరవేగంగా జరగడం అప్డేట్స్ కూడా వరుసగా రావడంతో వీరమల్లు పై ఆసక్తి కాస్తా ఓజి వైపు మళ్లింది. ఇక లేటెస్ట్ గా సోషల్ మీడియాలో అయితే ఓజి మేకర్స్ నార్మల్ సమయంలో కూడా భారీ హైప్ కొల్లగొట్టేస్తున్నారు. దీనితో వీర మేకర్స్ కూడా పోటీగా పోస్ట్ లు వేస్తున్నారు. దీనితో ఈ రెండు సినిమాల నడున వార్ ఓ రేంజ్ లో నడుస్తోంది అని చెప్పాలి. మరి ఇది వీర వర్సెస్ ఓజి వార్ గా కొనసాగుతుందా లేక వీర అండ్ ఓజి గా మారుతుందా అనేది చూడాలి.