మాన్షన్ 24 వెబ్ సిరీస్ తో ఓంకార్

Published on Sep 18, 2023 8:30 pm IST

యాంకర్ నుండి దర్శకుడిగా మారిన ఓంకార్ కొత్త ప్రాజెక్ట్‌తో తిరిగి వస్తున్నాడు, కానీ ఈసారి అది వెబ్ సిరీస్. రాజు గారి గది ఫ్రాంచైజీలోని మూడు భాగాలకు దర్శకత్వం వహించినందుకు అతను బాగా పేరు పొందాడు. అతని తాజా వెంచర్ పేరు మాన్షన్ 24. ఈ సిరీస్ హారర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని ఫస్ట్ లుక్ ను ఆన్‌లైన్‌లో విడుదల చేయడం జరిగింది. ఈ ఫస్ట్ లుక్ విశేషం గా ఆకట్టుకుంటుంది. దీని ప్రీమియర్ గురించిన వివరాలు తెలియనప్పటికీ, ఈ సిరీస్ ప్రత్యేకంగా OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో రానున్నట్లు తెలుస్తుంది.

మ్యాన్షన్ 24లో అవికా గోర్, వరలక్ష్మి శరత్‌కుమార్, బిందు మాధవి, నందు, విద్యు రామన్, రాజీవ్ కనకాల, అమర్‌దీప్ చౌదరి, మానస్ మరియు ఇతర ప్రముఖ పాత్రలు ఉన్నాయి. ఈ A రేటెడ్ సిరీస్ గురించి మరిన్ని వివరాల త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :