శర్వానంద్ “ఒకే ఒక జీవితం” టీజర్ విడుదల కి ముహూర్తం ఫిక్స్!

శర్వానంద్ “ఒకే ఒక జీవితం” టీజర్ విడుదల కి ముహూర్తం ఫిక్స్!

Published on Dec 27, 2021 9:05 PM IST


శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఒకే ఒక జీవితం. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ప్రభు ఎస్ ఆర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో శర్వానంద్ సరసన హీరోయిన్ గా రీతూ వర్మ నటిస్తోంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే విడుదల అయి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ పై చిత్ర యూనిట్ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ చిత్రం టీజర్ ను డిసెంబర్ 29 వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించడం జరిగింది. అమల అక్కినేని కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బెజొయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు