‘ఒకే ఒక జీవితం’ ఓటీటీ రిలీజ్ అప్పుడే ?

‘ఒకే ఒక జీవితం’ ఓటీటీ రిలీజ్ అప్పుడే ?

Published on Sep 25, 2022 6:30 PM IST

శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఇటు ఇండియాలోనే కాకుండా అటు ఓవర్సీస్‌లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. ప్టెంబర్‌ 9న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడు ?, ఇదే విషయం పై నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ‘ఒకే ఒక జీవితం’ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చింది.

కాగా ఈ సినిమా ఓటీటీ విడుదల డేట్‌ దాదాపుగా ఫిక్స్‌ అయిందని టాక్ నడుస్తోంది. అక్టోబర్‌ రెండో వారంలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతుందో తెలుసా ?, సోనీ లివ్‌ లో స్ట్రీమింగ్‌ కాబోతుంది. సోనీ లివ్‌ ఈ సినిమా ఓటీటీ హక్కులను రూ.15 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ ‘ఒకే ఒక జీవితం’లో రీతూ వర్మ కథానాయికగా నటించింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొత్తమ్మీద ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. సినిమాలో గుడ్ ఎమోషన్స్, బెటర్ స్క్రిప్ట్ ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు