ఒక్క క్షణం సెన్సార్ వివరాలు !

అల్లు శిరీష్ హీరోగా సురభి హీరొయిన్ గా సీరత్ కపూర్, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న సినిమా ‘ఒక్క క్షణం’ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ సట్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా ఆడియన్స్ ను థ్రిల్ చెయ్యబోతోంది.

అబ్బూరి రవి మాటలు అందించిన ఈ సినిమాకు శ్యాం కె నాయుడు కెమెరా మెన్ గా పనిచేసారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టిజర్ కు మంచి స్పందన లభించింది. దీంతో సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. త్వరలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోబోతున్న ఈ సినిమాకు చోటా కె ప్రసాద్ ఎడిటర్.