త్వరలో ‘ఒక్క క్షణం’ మొదటిపాట విడుదల !
Published on Dec 7, 2017 2:04 pm IST

వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఒక్క క్షణం’. సురభి, శీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు వి.ఐ.ఆనంద్ నుండి వస్తోన్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి హోప్స్ ఉన్నాయి. తాజాగా ‘ఒక్క క్షణం’ సినిమా శాటిలైట్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడైన సంగతి తెలిసిందే.

మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలోని మొదటిపాట ‘సో మెని సో మెని’ రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు విడుదలకానుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది. చాలా మంది సినీ ప్రముఖులు టీజర్ ను మెచ్చుకున్నారు కూడ. డిసెంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకురాబోతున్న ఈ సినిమాకు శ్యాం. కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు.

 
Like us on Facebook