గ్రాండ్ గా అల్లు హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ !

అల్లు శిరీష్ , సురభి జంటగా శ్రీనివాస్ అవసరాల, సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఒక్క క్షణం’. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు విఐ.ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో సినిమాకు హైప్ వచ్చింది. ఇటివల విడుదలైన ఈ సినిమా టిజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

ఈ రోజు సాయంత్రం సంధ్య కన్వెన్షన్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. అల్లు అర్జున్ గెస్ట్ గా రానున్న ఈ ఈవెంట్ కు మరికొంతమంది సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నారు. యు మీడియా ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసింది. అబ్బూరి రవి మాటలు అందించిన ఈ సినిమాకు శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ నెల 28 న ఒక్క క్షణం ప్రేక్షకుల ముందుకు రానుంది.