ఒక్క క్షణం రిలీజ్ డేట్ ఫిక్స్ !

అల్లు శిరీష్ చేస్తోన్న ఒక్క క్షణం టిజర్ విడుదలైన తరువాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా లో సురభి హీరొయిన్ గా నటిస్తుండగా సీరత్ కపూర్ , అవసరాల శ్రీనివాస్ మరో ప్రదాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ నెల 28 న ఒక్క క్షణం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

స్ట్రాంగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. అబ్బూరి రవి మాటలు రాసిన ఈ సినిమాకు శ్యాం కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపతి ఈ చిత్రాన్ని నిర్మించారు. కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుందాం.