ఆ స్పెషల్ డే కి “ఒక్కడు” వరల్డ్ వైడ్ రిలీజ్.!

ఆ స్పెషల్ డే కి “ఒక్కడు” వరల్డ్ వైడ్ రిలీజ్.!

Published on Dec 13, 2022 9:00 AM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పలు సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో దర్శకుడు గుణశేఖర్ తో చేసినటువంటి హిట్ చిత్రం “ఒక్కడు” కూడా ఒకటి. తన కెరీర్ లో ఓ క్లాసిక్ హిట్ ఇది కాగా ఈ చిత్రంని రీ మాస్టర్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా ఆ మధ్య మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్ గా వరల్డ్ వైడ్ ఓ స్పెషల్ డే కి అయితే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా ఈ చిత్రం కన్ఫర్మ్ అయ్యింది.

ఈ చిత్రం రిలీజ్ అయ్యిన 20 ఏళ్ల సందర్భంగా అయితే వచ్చే జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం స్పెషల్ షోస్ వేసేందుకు ఖాయం అయ్యింది. మరి దీనితో అయితే మహేష్ ఫ్యాన్స్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి అయితే మణిశర్మ సూపర్బ్ ఆల్బమ్ ని అందించగా భూమిక మహేష్ సరసన హీరోయిన్ గా నటించింది. అలాగే ఎం ఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు