పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం “ఆదిపురుష్”. మైథలాజికల్ మూవీగా వస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో డైరెక్టర్ ఓం రావత్ ఈ సినిమాకి సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు.
ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ పేరు రామ కాదని, లార్డ్ రామ మరో పేరు రాఘవ అని చెప్పాడు. దీంతో సినిమాలో ప్రభాస్ పేరు రాఘవ అని ఉండబోతున్నట్టు క్లారిటీ ఇచ్చాడు. ఇక మొదట సినిమాలోని మూడు సన్నివేశాలు వివరించిన తర్వాత ప్రభాస్ ఈ ప్రాజెక్టును ఒకే చేశాడని ఓం రౌత్ తెలిపాడు. ఇదిలా ఉంటే టీ సిరీస్, రెట్రోఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కృతిసనన్ సీత పాత్రలో, సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రలో, బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో, మరాఠి నటుడు దేవ్దత్త నగే హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు.