‘రాజుగారి గది-2’ లో సమంత కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూడొచ్చట !

హీరోయిన్ సమంత ఇటీవలే హీరో నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె చేసిన సినిమాల్లో ప్రస్తుతం ‘రాజుగారి గది-2’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 13న చిత్రం రిలీజ్ కానుంది. ఈ హర్రర్ సినిమాలో సమంత ఒక ఆత్మ పాత్రలో కనిపించనుంది. ఇన్నాళ్లు ఎక్కువగా కమర్షియల్ రోల్స్ మాత్రమే చేసిన సమంత తొలిసారి భిన్నమైన పాత్ర చేయడంతో ఆ పాత్ర, అందులో సమంత కొత్త తరహా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు.

ఈ పాత్ర గురించే మాట్లాడిన చిత్ర దర్శకుడు ఓంకార్ సమంత చాలా గొప్పగా నటించారని, ఇందులో ఆమె కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూడొచ్చని, ముఖ్యంగా క్లైమాక్స్ లో అయితే నాగార్జున, సమంతల నటన చాలా అద్భుతంగా ఉంటుందని, వాళ్లిద్దరే సినిమాను నడిపించారని చెప్పుకోచ్చారు. మరి ఓంకార్ చెబుతున్నట్టు ఆత్మగా సమంత ఎలాంటి మ్యాజికల్ పెర్ఫార్మెన్స్ చేసిందో చూడాలంటే 13 వరకు ఆగాల్సిందే.