వైరల్ : “జవాన్” రిలీజ్..తిరుమలేశుని సన్నిధిలో షారుఖ్

Published on Sep 5, 2023 8:03 am IST


ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి ఉన్న అవైటెడ్ చిత్రాల్లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అట్లీ తెరకెక్కించిన మాసివ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “జవాన్” కోసం అందరికీ తెలిసిందే. షారుఖ్ “పఠాన్” సెన్సేషన్ తర్వాత వస్తున్నా సినిమా ఇది కావడంతో హైప్ దానికి మించి అయితే నెలకొంది.

అయితే ఈ సినిమా పట్ల మేకర్స్ నమ్మకంగా ఉండగా లేటెస్ట్ గా అయితే షారుఖ్ మొట్టమొదటి సారిగా తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోడానికి వస్తున్నాడన్న వార్తలు వైరల్ గా మారగా లేటెస్ట్ గా అయితే షారుఖ్ మరియు తన కూతురు అలాగే దర్శకుడు అట్లీ, హీరోయిన్ నయనతార మరియు తన భర్త విగ్నేష్ శివన్ లు కూడా తిరుమలేశుని సన్నిధిలో చేరి ఆశీస్సులు తీసుకున్నారు. దీనితో ఇపుడు సోషల్ మీడియాలో ఈ విజువల్స్ కొన్ని వైరల్ గా మారాయి. దీనితో జవాన్ రిలీజ్ కోసం షారుఖ్ మొట్ట మొదటిసారిగా తిరుమల దర్శనానికి రావడం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత సమాచారం :