SSMB28 నుండి ఆ రోజున సర్ప్రైజ్ రానుందా ?

SSMB28 నుండి ఆ రోజున సర్ప్రైజ్ రానుందా ?

Published on Nov 2, 2022 2:37 AM IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా టాప్ ప్రొడక్షన్ హౌస్ హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మాతగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ SSMB28. ఇంకా అఫీషియల్ టైటిల్ నిర్ణయం కాని ఈ మూవీలో సూపర్ స్టార్ మహెష్ బాబు ఒక పవర్ఫుల్ మాస్ రోల్ చేస్తుండగా దీనిని హై ఆక్టేన్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ త్రివిక్రమ్ ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుండగా ఈనెల 7న త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక మూవీ నుండి ఒక సర్ప్రైజ్ వచ్చే అవకాశం ఉందని లేటెస్ట్ ఇండస్ట్రీ బజ్. అయితే పక్కాగా ఆ రోజున ఈ మూవీ నుండి ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వస్తే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పెద్ద పండుగే అంటున్నవ్ సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు