మరోసారి బాలయ్య, రవితేజ క్లాష్.. ఇప్పుడెవరు గెలుస్తారు?

మరోసారి బాలయ్య, రవితేజ క్లాష్.. ఇప్పుడెవరు గెలుస్తారు?

Published on Jun 13, 2024 8:58 AM IST


ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీతో తన కెరీర్ లో 109వ సినిమాని (NBK 109) చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరో పక్క మరో స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తో “మిస్టర్ బచ్చన్” అనే సాలిడ్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా క్లాష్ కి సిద్ధం కానున్నాయి అని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఆల్రెడీ రవితేజ, బాలయ్య నడుమ టాలీవుడ్ లో ఎన్నోసార్లు క్లాష్ జరిగింది. జస్ట్ గత ఏడాదిలోనే “భగవంత్ కేసరి” (Bhagavanth Kesari), “టైగర్ నాగేశ్వరరావు” లు క్లాష్ కి రాగ ఈసారి బాలయ్యది పై చేయి అయ్యింది. ఇక ఈ ఏడాదిలో ఈ సెప్టెంబర్ 27న మరోసారి ఇద్దరి సినిమాలు రానున్నట్టుగా వినిపిస్తుంది. దీనితో మరోమారు ఇద్దరి నడుమ క్లాష్ పడనుంది అని చెప్పాలి. ఇక ఈసారి క్లాష్ లో ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాలి. ముందుగా రెండు సినిమాలపై రిలీజ్ సంబంధించి ఓ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు