తేజ్, దేవా ల “రిపబ్లిక్” కి మళ్ళీ అదే హార్డ్ హిట్టింగ్ రెస్పాన్స్.!

Published on Nov 28, 2021 4:00 pm IST

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మరియు సబ్జెక్ట్ తో కొట్టే దర్శకుడు దేవా కట్ట ల కాంబోలో రీసెంట్ గా వచ్చిన సినిమా “రిపబ్లిక్”. ఒక్క వీరిద్దరి కెరీర్ లోనే కాకుండా టోటల్ టాలీవుడ్ లోనే ఒక బెస్ట్ సినిమాగా ఇది ప్రశంసలు అందుకుంది. అయితే గత అక్టోబర్ లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా బాక్సాఫీస్ పరంగా అంతగా ఆకట్టుకోకపోయినా అప్పుడు నుంచి ఇప్పుడు వరకు సినిమా చూసిన వారు ప్రతి ఒక్కరి నుంచి ఒకే లాంటి ఫీడ్ బ్యాక్ ను అందుకుంది.

అయితే అప్పుడు థియేటర్స్ లో చూసినవారు ఎంతైతే రియాక్షన్ ఇస్తున్నారో ఇప్పుడు రీసెంట్ గా ఓటిటి లోకి వచ్చాకా చూసిన వారు కూడా అంతే హార్డ్ హిట్టింగ్ రెస్పాన్స్ అందిస్తున్నారు. ముఖ్యంగా సాయి తేజ్ మరియు దేవా కట్టల గ్రేట్ అటెంప్ట్ కి మరిన్ని ప్రశంసలు అందిస్తున్నారు. ప్రస్తుత వ్యవస్థ ఎలా ఉంది అనే దానిని ఎంతో ఇంటెన్స్ గా తీసిన సినిమా ఇది. ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే ఖచ్చితంగా ఈ అటెంప్ట్ ని జీ 5 లో చూడొచ్చు.

సంబంధిత సమాచారం :