క్రేజీ: మరోసారి పుంజుకుంటున్న “కల్కి 2898 ఎడి”

క్రేజీ: మరోసారి పుంజుకుంటున్న “కల్కి 2898 ఎడి”

Published on Jul 6, 2024 12:31 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కల్కి 2898 ఎడి”. మరి ఎంతో హైప్ తో వచ్చిన ఈ చిత్రం రికార్డులు ఇప్పుడు తిరగ రాస్తుండగా కేవలం మొదటి వారాంతం లోనే కాకుండా వర్కింగ్ డేస్ లోకి వచ్చిన తర్వాత కూడా కల్కి అన్ని చోట్లా స్ట్రాంగ్ హోల్డ్ లో దూసుకెళ్తుంది.

అయితే ఇప్పుడు మరో వారాంతం లోకి సినిమా అడుగు పెడుతుండగా ఈ వీకెండ్ మరోసారి కల్కి యుఫోరియా స్టార్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. మెయిన్ గా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వర్కింగ్ డేస్ కంటే ఎక్కువ శాతం బుకింగ్స్ వీకెండ్ లో కనిపిస్తున్నాయి.

అలాగే తెలంగాణాలో టికెట్ ధరలు కూడా తగ్గడం ఫ్యాక్టర్ కూడా బాగా కలిసి రావడంతో నైజాంలో బుకింగ్స్ మరింత స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే మళ్ళీ వీకెండ్ లో కల్కి బాగా పుంజుకుంటుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లు కూడా నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు