“సలార్” నుంచి మరోసారి లీక్స్.?

“సలార్” నుంచి మరోసారి లీక్స్.?

Published on Nov 10, 2022 7:31 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా ఇప్పుడు శరవేగంగా సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. ఇక ఈ భారీ సినిమా షూటింగ్ ఓ పక్క జరుగుతున్నప్పటికీ సినిమా స్టార్ట్ చేసిన మొదటి లోనే సినిమా తాలూకా లీక్స్ బయటకి వచ్చేసాయి.

ఆన్ సెట్స్ లో కొన్ని స్టిల్ లు ప్రభాస్ మీదనే రాగ కొన్ని వీడియోలు కూడా వచ్చేసాయి. ఇక ఇప్పుడు మళ్ళీ సినిమాపై లీకులు స్టార్ట్ అయ్యినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా కొన్ని లీక్ లు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య వైరల్ గా మారుతున్నాయి. మరి దీనితో అయితే మేకర్స్ ఈ సినిమా విషయంలో ఏం చేస్తున్నారో అని ఇంకొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ముందు రోజుల్లో అయినా ఇలాంటివి అడ్డుకుంటారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు