మరోసారి విలన్ గా కనిపించనున్న నాని

Published on Jan 18, 2022 5:34 pm IST


నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు నాని. అంతేకాకుండా తన రాబోయే అయిన అంటే సుందరానికి, దసరా సినిమాల షూటింగ్‌లలో బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న తన తదుపరి చిత్రం దసరాలో నాని అనేక గ్రే షేడ్స్‌ తో యాంటీ హీరో పాత్రను పోషించనున్నాడని తాజా సమాచారం.

నాని ప్రతినాయకుడిగా నటించడం కొత్తేమీ కాదు. జెంటిల్‌మన్‌, వి వంటి సినిమాల్లో నెగెటివ్‌ క్యారెక్టర్‌లో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఓమిక్రాన్ కారణం దసరా షూటింగ్ ఆగిపోయింది. నాని తన లుక్‌ పై జాగ్రత్తలు తీసుకుంటున్నాడు, ఇది ప్రేక్షకులకు పూర్తిగా కొత్తది. నేను లోకల్ తర్వాత, బొగ్గుగని బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో కీర్తి సురేష్ మళ్లీ నాని సరసన నటిస్తోంది. సత్యన్ సూర్యన్ కెమెరా హ్యాండిల్ చేస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :