లేటెస్ట్..కళ్యాణ్ రామ్ కోసం మరోసారి తారక్.!

Published on Feb 4, 2023 11:00 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లో మంచి అంచనాలు సెట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా లేటెస్ట్ చిత్రాల్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా దర్శకుడు రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “అమిగోస్” కూడా ఒకటి. మరి ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ మరిన్ని అంచనాలు పెంచగా మేకర్స్ లేటెస్ట్ గా ఓ సాలిడ్ అనౌన్సమెంట్ ని నందమూరి ఫ్యాన్స్ కి అందించారు.

ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కానున్నట్టుగా ఫిక్స్ చేశారు. మరి ఈ ఈవెంట్ రేపు ఫిబ్రవరి 5న సాయంత్రం హైదరాబాద్ జె ఆర్ సి కన్వెన్షన్ హాల్ లో జరగనుండగా తారక్ ఛీఫ్ గెస్ట్ గా దీనిని గ్రేస్ చేయనున్నారు. మరి లాస్ట్ కూడా ఎన్టీఆర్ గెస్ట్ గా వెళ్లిన కళ్యాణ్ రామ్ చిత్రం “బింబిసార” భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరోసారి తన అన్న కోసం తాను వస్తున్నాడు. మరి ఈచిత్రం కూడా అలాంటి ఫలితాన్నే అందుకోవాలని ఆశిద్దాం. ఇక ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :