మరోసారి అందరి చూపు ‘ఆర్ఆర్ఆర్’ వైవు .. కారణం అదే …. !!

మరోసారి అందరి చూపు ‘ఆర్ఆర్ఆర్’ వైవు .. కారణం అదే …. !!

Published on Aug 5, 2022 2:00 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ రామ్ చరణ్ కలిసి నటించిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి భారీ స్థాయి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. రాజమౌళి ఎంతో అత్యద్భుతంగా తెరకెక్కించిన ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీంగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. అలానే అటు ఓటిటి మాధ్యమాల్లో కూడా అత్యధిక స్థాయి వ్యూస్ తో దుమ్ముదులిపిన ఆర్ఆర్ఆర్ మూవీని ప్రముఖ టెలివిజన్ సంస్థ జీ సినిమా వారు స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 14న రాత్రి 8 గంటలకు ప్రసారం చేయనున్నారు.

ఇప్పటికే నార్త్ ఆడియన్స్ లో విపరీతంగా పేరు సంపాదించిన ఆర్ఆర్ఆర్ హిందీ వర్షన్, రేపు టీవీల్లో ప్రసారం అయిన తరువాత భారీ స్థాయి టిఆర్పిని దక్కించుకునే ఛాన్స్ గట్టిగా కనపడుతోందని అంటున్నారు విశ్లేషకులు. ఆ విధంగా మరొక్కసారి అందరి చూపు ఆర్ఆర్ఆర్ పైన పడింది. మరికొద్దిరోజుల్లో బుల్లితెర ప్రేక్షకులని అలరించనున్న ఆర్ఆర్ఆర్ ఎంత మేర టిఆర్పి ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు