మరోసారి విదేశాలకు వెళ్లనున్న సూపర్ స్టార్ … అందుకోసమేనట …?

Published on Jul 16, 2022 2:30 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ అతి త్వరలో త్రివిక్రమ్ మూవీ షూట్ లో జాయిన్ కానున్నారు. మహేష్ కెరీర్ 28వ మూవీగా ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ మూవీలో మహేష్ కి జోడీగా పూజా హెగ్డే నటించనుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎస్ రాధాకృష్ణ, హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ భారీ మూవీ వేగవంతంగా షూటింగ్ జరుపుకుని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.

ఇక ఇటీవల సర్కారు వారి పాట సూపర్ హిట్ కొట్టిన అనంతరం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చిన సూపర్ స్టార్ మహేష్, నెక్స్ట్ వీక్ లండన్ ట్రిప్ కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తన కుమారుడు గౌతంకృష్ణ ని లండన్ లోని ఒక ప్రముఖ కళాశాలలో జాయిన్ చేసేందుకు మహేష్, నమ్రత దంపతులు ప్రత్యేకంగా అక్కడికి వెళ్తున్నారట. మరోవైపు త్రివిక్రమ్ మూవీ కోసం మేకోవర్ లో ఒకింత డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్న సూపర్ స్టార్, వచ్చే నెల మొదటి వారంలో ఇండియాకి తిరిగి రానున్నారట. అనంతరం రెండవ వారం మూవీ షూట్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ కమర్షియల్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీకి మది ఫోటోగ్రఫి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :