ఒక్కరోజు మాత్రమే ఉంది – రకుల్ ప్రీత్ సింగ్

Published on Oct 7, 2021 9:21 am IST

పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్ లుగా నటించిన తాజా చిత్రం కోండపోలం. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వై. రాజీవ్ రెడ్డి, జే. సాయి బాబు లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కొండపోలం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, పాటలు, టీజర్, ట్రైలర్ లకి ప్రేక్షకులు, అభిమానుల నుండి విశేష స్పందన లభించింది. అయితే ఈ చిత్రం అక్టోబర్ 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేపట్టింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రం విడుదల గురించి స్పందించడం జరిగింది. ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది అంటూ సోషల్ మీడియా లో చెప్పుకొచ్చారు. సాయి చంద్, కోట శ్రీనివాస్ రావు, నాజర్, అన్నపూర్ణ, హేమ, అంతోనీ, రవి ప్రకాష్, మహేష్ విట్ట, రచ్చ రవి, ఆనంద్ విహారి లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉప్పెన తొలి చిత్రం తోనే సూపర్ హిట్ సాధించిన వైష్ణవ్ తేజ్, ఈ చిత్రం కూడా అదే తరహా హిట్ సాధిస్తుంది అని చిత్ర యూనిట్ చెప్పుకొస్తుంది.

సంబంధిత సమాచారం :