ఆల్ ఇండియా రికార్డు సృష్టించిన “భీమ్లా నాయక్”

Published on Sep 12, 2021 3:40 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయ్యప్పనం కోషియం చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్, మేకింగ్ వీడియో, ఫస్ట్ సింగిల్ విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రతి ఒక్కటి కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది.

పవన్ కల్యాణ్ ఈ చిత్రం లో పవర్ ఫుల్ పోలీస్ పాత్ర లో నటిస్తున్నారు. రానా దగ్గుపాటి విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ భారీ వ్యూస్ ను సాధించడం జరిగింది. అంతేకాక ఈ సాంగ్ వన్ మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా ఇంకా యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

అదే తరహాలో భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ కూడా ఊహించని రీతిలో వ్యూస్ ను కొల్లగొట్టడం కాకుండా, లైక్స్ లో ట్రెండ్ సెట్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ మిలియన్ లైక్స్ సొంతం చేసుకున్న గ్లింప్స్ గా రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ విషయం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తుండగా, ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :